Brans fry | బీన్స్ వేపుడు
బీన్స్ వేపుడు చాలా త్వరగా చేసేయొచ్చు. వీటిలో A, C, K విటమిన్లు, ఫోలిక్ ఆసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. వారానికి కనీసం రెండుసార్లు తీసుకుంటే ఎంతో మంచిది.
కావలసిన పదార్థాలు :
బీన్స్ - 250 gms
ఆవాలు
మినప్పప్పు
శనగపప్పు
ఉల్లిగడ్డ - చిన్నది 1
ఉప్పు
కారం - 1/4 స్పూన్
పల్లీలు, పుట్నాలు పొడి - 3 స్పూన్స్
వేయించిన తెల్ల నువ్వులు - 1 స్పూన్
కరివేపాకు పొడి - 1/2 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
తెల్లగడ్డ - 6 రెబ్బలు
నూనె - 2 స్పూన్స్
తయారుచేసే విధానం :
1. ఒక ఇనుప బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి.
2. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి నిమిషం పాటు వేయించాలి.
3. తరువాత సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు వేసి తక్కువ మంట మీద నిమిషం వేయించాలి. బీన్స్ బాణలి మధ్యలో కాకుండా, పై అంచుల వరకు పరచాలి. ఇలా చేయడం వల్ల వేడి అన్ని ముక్కలకి సమానంగా చేరుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి 10 నిమిషాలు వేయించాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.
4. బీన్స్ ఉడికేవరకు ఉంచి స్టవ్ ఆపేసి, కారం, నువ్వులు, పల్లీలు పుట్నాల పొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, దంచిన తెల్లగడ్డ వేసి బాగా కలపాలి. కమ్మటి బీన్స్ వేపుడు రెడీ.
నేను తెల్ల నువ్వులు దోరగా వేయించి ఒక గాజు సీసాలో పెట్టుకుంటాను. ఇలా కూరల్లో వేయడానికి సులభంగా ఉంటుంది.
Comments
Post a Comment