గోంగూర పచ్చడి
ఆంధ్రుల అభిమాన పచ్చడి - గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూద్దాం.
కావలసిన పదార్థాలు :
గోంగూర - 2 కట్టలు
ధనియాలు - 1 కప్
ఎండుమిరప కాయలు - 20
తాలింపు దినుసులు - ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు
నూనె - 100 గ్రాములు
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం :
1. గోంగూర శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.
2. ఒక బాణలిలో ధనియాలు, ఎండుమిరపకాయలు నూనె వేయకుండా దోరగా వేయించుకోవాలి.
3. రెండు స్పూన్ల నూనె వేసి గోంగూరని మూత పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టడం వల్ల వచ్చే ఆవిరి గోంగూర చక్కగా ఉడుకుతుంది.
5. ముందుగా ధనియాలు, ఎండుమిరపకాయలు పొడి చేసుకోవాలి.
6. ఆ తర్వాత గోంగూరని నూరుకోవాలి.
7. గోంగూర ముద్దలో పొడిని కలుపుకోవాలి.
8. బాణలిలో తాలింపు వేసి, గోంగూర ముద్దని వేసి తక్కువ మంటపై 5 నిమిషాలు వేయించాలి. గోంగూర పచ్చడి సిద్ధం.
వేేడి వేేడి అన్నంలో నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి కలుపుకుని తినండి. ఇడ్లీ, దోస, చపాతీ లోకి కూడా చాలా బాగుంతుంది.
Comments
Post a Comment