Chicken gravy for Idli | ఇడ్లీలోకి చికెన్ పులుసు
కావలసిన పదార్థాలు :
చికెన్ - 350 గ్రాములు
ఎండు కొబ్బరి - 50 గ్రాములు
ఉల్లిగడ్డ - 1 పెద్దది
టొమాటోలు - 2 చిన్నవి
అల్లం - 2 అంగుళాల ముక్క
వెల్లుల్లి - 15
పెరుగు - 3 స్పూన్స్
కరివేపాకు - 2 రెమ్మలు
పుదీనా - గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
సోంపు - 1 స్పూన్
లవంగాలు - 4
దాల్చినచెక్క - 2 అంగుళాల ముక్క
ఆవాలు - 1/2 స్పూన్
నూనె - 3 స్పూన్స్
కారం - 3 స్పూన్స్
ధనియాలపొడి - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నిమ్మరసం - 1 స్పూన్
తయారుచేసే విధానం :
చికెన్ పులుసు చేయడానికి నేను మట్టిపాత్రని వాడుతున్నాను. దీన్ని కుక్కర్ లో కూడా చేయొచ్చు. కానీ మట్టిపాత్రలో చేసిన పులుసు తిన్నారంటే ప్రతిసారి మట్టిపాత్రలోనే వండుతారు....అంత రుచిగా ఉంటుంది.
ఉల్లిగడ్డ కొద్దిగా నూనెలో వేయించడానికి ఉంచి, మిగిలినది పేస్ట్ కోసం వాడాలి.
అల్లం వెల్లుల్లి కొద్దిగా చికెన్ marination కి, మిగిలినది పేస్ట్ తయారీలో వాడాలి.
1. చికెన్ marination
చికెన్ ముక్కలని పసుపు, ఉప్పు వేసి నాలుగు సార్లు బాగా కడిగి అందులో పసుపు, ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి.
2. పేస్ట్ తయారీ విధానం
కొబ్బరి, ఉల్లి, టమాటో, అల్లం, వెల్లుల్లి, పెరుగు, పసుపు, కారం, ధనియాలపొడి, పుదీనా, కరివేపాకు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి.
3. పులుసు తయారుచేసే విధానం :
మట్టిపాత్రలో నూనె వేసి, కాగాక అందులో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి బాగా వేయించాలి. ఆ తరువాత పేస్ట్ ని వేసి, నూనె పైకి తేలేవరకు ఓపికగా వేయించాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ మూత పెట్టి వేయించాలి. చికెన్ ముక్కల్ని వేసి 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మసిలేలా ఉడికించాలి. ఇడ్లి కోసం చేసున్నాం కాబట్టి నీళ్లు ఎక్కువగానే వేసుకోవాలి. ఒకసారి రుచి చూసి ఉప్పు, కారం కావాలంటే వేసుకోవాలి. తక్కువ మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసాక గుప్పెడు కొత్తిమీర తరుగు, నిమ్మరసం కలుపుకోవాలి.
వేడి వేడి ఇడ్లీలోకి చికెన్ పులుసు చాలా రుచిగా ఉంటుంది.
Comments
Post a Comment