Hariyali tawa chicken

          హరియాలీ తవ చికెన్ - పేరు చూసి ఇదేదో చాలా కష్టమైన వంటకమేమో అనిపిస్తుంది కదా. కానే కాదండీ. చాలా చాలా సులభంగా చేసుకోవచ్చు. అస్సలు వంట రాని వాళ్ళు కూడా  చక్కగా చేసి అందరితో శెభాష్ అనిపించుకోవచ్చు.


కావలసిన పదార్థాలు :

చికెన్ - 250 gms
పుదీనా - గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చి మిరపకాయ - 1
అల్లం - ఒక అంగుళం ముక్క
వెల్లుల్లి - 7 రెబ్బలు
గరం మసాలా - 1/2 స్పూన్
పసుపు - 1/4 స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 2 స్పూన్స్

తయారుచేసే విధానం :
1. చికెన్ ని ఐదు సార్లు పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడగాలి
2. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిరపకాయ, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, పసుపు, ఉప్పు అన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి.
3. చికెన్ కి ఈ పేస్ట్ బాగా పట్టించి కనీసం ఒక గంట సేపు నానబెట్టాలి.
4. ఒక గంట తర్వాత cast iron పెనుము తీసుకుని medium మంట మీద వేడి చేయాలి. 2 స్పూన్స్ నూనె వేసి, కాగాక చికెన్ ముక్కలు పెనుము నిండా పరచాలి. మూత పెట్టి 5 నిమిషాలు వేగానివ్వాలి. తర్వాత ముక్కలన్నింటిని తిప్పి మరో 5 నిమిషాలు వేయించాలి. మూత తీసి చికెన్ మాడిపోకుండా వాటిని తిప్పుతూ అన్ని వైపులా సమానంగా వేయించాలి.
5. ప్లేట్ లోకి తీసుకుని మిరియాలపొడి చల్లుకోవాలి. 
          చాలా తక్కువ నూనెతో ఎంతో రుచికరమైన హరియాలి తవ చికెన్ మీరు కూడా చేసి చూడండి.

Comments