Mixed nuts sweet

 

కావలసిన పదార్థాలు :

తెల్ల నువ్వులు
నల్ల నువ్వులు
అవిసె గింజలు
బాదం పప్పు
గుమ్మడి గింజలు
దోస గింజలు
పుచ్చకాయ గింజలు
యాలకులు
బెల్లం
నెయ్యి

తయారుచేసే విధానం :

1. బెల్లం తప్ప మిగిలిన గింజలు, పప్పులన్నీ విడివిడిగా వేయించుకోవాలి. మందపాటి అడుగు ఉన్న బాణలిలో తక్కువ మంట మీద పప్పులన్నీ దోరగా వేగేలాగా చూసుకోవాలి. అన్నిటినీ చల్లారనివ్వాలి.

2. పైన వేయించి, చల్లారిన పప్పులన్నీ పొడి చేసుకోవాలి. చివరగా బెల్లం కూడా పొడి చేసుకోవాలి.

3. పప్పుల పొడి, బెల్లం పొడి, చాలా కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. పప్పుల్లో నుండి నూనె వస్తుంది కాబట్టి నెయ్యి ఎక్కువగా అవసరo ఉండదు.

4. మీకు కావలసిన పరిమాణంలో లడ్డులా చేసి మధ్యలో వేలితో కొద్దిగా వత్తాలి. నేను ఒక గోళికాయ పరిమాణంలో చేసాను. ఇవి రోజుకి రెండు తింటే మనకి ఒక రోజుకి కావసలసిన పోషకాలన్నీ అందుతాయి.
           పైన చెప్పిన పప్పులన్నీ వేయాలని రూలేమి లేదు. మనకు అందుబాటులో ఉన్న ఎలాంటి రకమైన పప్పులతోనైనా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఒక్కోరకం పప్పులతో మార్చి మార్చి చేసుకుంటే అన్నింటిలో ఉన్న పోషకాలు లభిస్తాయి.

Comments