కాలా జామూన్ | Kaala jamun | Sweets


            మీరు డైట్ లో ఉన్నారా? అయితే ఈ పోస్ట్ మీ కోసం కాదు. 🙂 మీరు ఎలాంటి డైట్ లో ఉన్నా సరే, మీ cheat meal లో ఇలాంటి స్వీట్స్ ని ఏ మూణ్ణెళ్లకో, ఆర్నెళ్లకో ఒకసారి తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవాళ్లు మాత్రం కాలా జామూన్ అనే  పేరు కూడా తలుచుకోవద్దు. 😜

            కాలా జామూన్ అనే పేరులోనే తెలుస్తోంది కదా ఇది నల్లటి గులాబ్ జామూన్ అని. మనం మాములుగా చేసే గులాబ్ జామూన్ ని ఇంకొంచెం ఎక్కువ సేపు వేయించితే అదే కాలా జామూన్. నేను గులాబ్ జామూన్ చాలాసార్లు చేసాను. అయితే ప్రతిసారి చిన్న చిన్న మార్పులతో చేయడం వల్ల పర్ఫెక్ట్ జామూన్ చేయడం ఎలాగో తెలుసుకున్నాను. 


కావలసిన పదార్థాలు :

     MTR instant గులాబ్ జామూన్ మిక్స్ 100 gms ( 33 జామూన్ లు వచ్చాయి )
     గోరువెచ్చని నీళ్లు - తగినంత
     నెయ్యి - 1/2 స్పూన్
     నూనె - deep fry కి సరిపడినంత

జీరా తయారీ కోసం : 

     చక్కెర - 200 gms
     నీళ్లు - 200 ml
     యాలకుల పొడి - కొద్దిగా

తయారుచేసే విధానం :

ముందుగా జీరా తయారుచేద్దాం. ఒక మందపాటి స్టీల్ గిన్నెలో చక్కెర, నీళ్లు, యాలకుల పొడి కలిపి స్టవ్ పైన పెట్టాలి. పెట్టి ఏమి చేయాలి అని సెటైర్ వేయకుండా on చేయండి. నీళ్లు మరగడం మొదలయ్యాక, తక్కువ మంటలో 10 నిమిషాలు ఉంచండి. జీరా కొద్దిగా చిక్కగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టకుండా వదిలేయండి. 

1. జామూన్ మిక్స్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

2. ఉండలు లేకుండా ఒకసారి కలపాలి.
3. ఇందులో కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అర స్పూన్ నెయ్యి వేసి పిండిని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు నాననివ్వాలి.

4. తరువాత, పిండిని ఒకసారి కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు రెండు అరచేతులతో గట్టిగా వత్తుతూ అవసరమైతే ఒక చుక్క నెయ్యి రాసుకుంటూ చేయాలి.
5. ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె తీసుకుని, బాగా కాగనివ్వాలి. మంట మీడియంలో ఉంచి మనం తయారు చేసుకున్న జామూన్ ఉండలని వేసి 30 సెకన్లు వేయించి, తరువాత 3 నిమిషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి. వేయించినంత సేపు కలుపుతూ ఉండడం వల్ల జామూన్ అన్ని వైపులా సమానంగా కాలుతుంది.

6. జామూన్ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండలని నూనెలో వేయించుకోవాలి. 
7. ఇలా తీసిపెట్టుకున్న జామూన్ లన్నిoటిని ఒకసారి నూనెలో వేసి, రెండు నిమిషాలు తక్కువ మంటపై వేయించాలి. ఇలా చేస్తే జామూన్ ముదురు గోధుమ రంగులోకి వస్తుంది. 

8. గాజు బొమ్మ కింద పడితే విరగకుండా ఉండదు, గులాబ్ జామూన్ నూనెలో వేయించితే పగలకుండా ఉండదు.😇 కాబట్టి జామూన్ లు cracks వచ్చాయని బాధపడకుండా జీరాలో ముంచేయండి. 

9. రెండు గంటల పాటు జీరాలో ఊరిన కాలా జామూన్ ని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తో అలంకరించి తియ్యటి పండగ చేసుకోండి. నేను బాదం, గుమ్మడి గింజల్ని సన్నగా కట్ చేసి వేసాను.

10. మీరు ఈ విధంగా చేసిన కాలా జామూన్ ని మధ్యలో స్పూన్ తో కట్ చేసి చూడండి. 

నేను చాలాసార్లు వేడి వేడి జీరాలో జామూన్ వేయడం వల్ల అవి మెత్తగా అయ్యేవి. నాకు అంతగా నచ్చేది కాదు. అందుకని ఒకసారి జీరా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి చూసాను. చాలా బాగా వచ్చాయి. జామూన్ మొత్తం జీరాతో నిండి juicy గా ఉంటుంది. పైన ఉన్న లేయర్ ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తినేటప్పుడు juicy గా ఉంటూ, పైనున్న లేయర్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. 

మీరు ఎంత డైట్ consious అయినా కూడా, ఒకటి లేదా రెండు జామూన్ లతో తినడం ఆపలేరు. అంత బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తయారు చేస్తే నేను రాసింది నిజమే అని ఒప్పుకుంటారు.


Comments