రొయ్యల కూర | Prawns Curry


              సముద్ర తీర ప్రాంతాల్లో వుండే వారికి రొయ్యలంటే ప్రాణం. అప్పుడప్పుడు రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిది. 

1. రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

2. రొయ్యల్లో కాల్షియమ్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఇ మరియు బి12 ఉండడం వల్ల శరీరంలోని రక్తనాళాలు శుభ్రపడతాయి.

3. రొయ్యల్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. దీంతో కండరాలు బలపడతాయి. ఇలా చాలా ఉపయోగాలు రొయ్యల వల్ల ఉన్నాయి.  రెండు మూడు నెలలకు ఒకసారి రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి.

కావలసిన పదార్థాలు :
రొయ్యలు - 14  pieces
ఉల్లిగడ్డ - 1
టమాటో - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - కొద్దిగా
పచ్చిమిరపకాయ - 1
పుదీనా - 5 ఆకులు
ఆవాలు
పసుపు
కారం
ఉప్పు
నూనె
కొత్తిమీర

తయారుచేసే విధానం : 

1. రొయ్యలను ఐదు సార్లు పసుపు, ఉప్పు వేసి బాగా కడగాలి. చివరగా అరచెక్క నిమ్మరసం పిండి కడగాలి. 

2. ఇలా శుభ్రపరచిన రొయ్యలను పసుపు, ఉప్పు పట్టించి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి.

3. ఒక బాణలిలో సగం స్పూన్ నూనె వేసి రొయ్యలు వేయించుకోవాలి. రొయ్యల నుండి వచ్చే నీటితోనే బాగా ఉడుకుతాయి. వీటిని ఒక ప్లేటులోకి తీసుకోవాలి.

4. అదే బాణాలిలో ఒక స్పూన్ నూనె వేసి, కాగాక అందులో ఆవాలు, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిముక్కలు, మిరపకాయ వేసి దోరగా వేయించాలి. 

5. పుదీనా వేసిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడే పసుపు, ఉప్పు, కారం వేయి నూనె పైకి తేలేవరకు వేయించాలి. 

6. ఇప్పుడు ఉడికించిన రొయ్యలను వేసి 2 స్పూన్ల నీళ్లు పోసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ మీ రుచికి తగినట్టుగా వేసుకోండి.

7. స్టవ్ ఆపేసిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు వండిన రొయ్యల కూర ఒకరికి సరిపోతుంది.


Comments