Prawns tawa fry



             Prawns tawa fry పేరు చాలా గంభీరంగా ఉంది కదా...సింపుల్ గా పెనంపై వేయించిన రొయ్యల వేపుడు అన్నమాట. వంటలు చేయడం రాని వాళ్ళు కూడా సులభంగా చేసి, అందరి మెప్పు పొందండి.

కావలసిన పదార్థాలు : 

రొయ్యలు - 14 pieces
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 స్పూన్
దాల్చినచెక్క పొడి - కొద్దిగా
మిరియాలు - 20
వెల్లుల్లి - 5 రెబ్బలు
నూనె - 1 స్పూన్
నీళ్లు - 2 స్పూన్స్

తయారుచేసే విధానం : 

1. రొయ్యలను బాగా కడిగి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క పొడి వేసి అరగంట సేపు నానబెట్టాలి.

2. ఒక ఇనుప పెనుము పై అర స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత అందులో రొయ్యలను పరచాలి.

3. మూడు నిమిషాలు వేయించి, రొయ్యలను తిప్పించి మరొక మూడు నిమిషాల వేయించాలి. మొత్తం ఆరు నిమిషాల తర్వాత 2 స్పూన్ల నీళ్లు వేసి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి.

4. మూత తీసి, రొయ్యలని తిప్పిస్తూ మూడు లేదా నాలుగు నిమిషాలు వేయించుకోవాలి. మిరియాలు, వెల్లుల్లి అప్పటికప్పుడు రోటిలో దంచి చల్లుకోవాలి.

             పది పదిహేను నిమిషాల్లో ఈజీ గా చేయవచ్చు. చాలా తక్కువ నూనెతో, తక్కువ పదార్థాలతో, ఎంతో రుచిగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి.


Comments