మటన్ కీమా వడలు

కావలసిన పదార్థాలు :
మటన్ కీమా - 100 గ్రాములు
శనగపప్పు - 4 స్పూన్స్
కారం - 1/2 స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/4 స్పూన్
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
లవంగాలు - 3
సోంపు - కొద్దిగా
పచ్చిమిరపకాయ - 2
ఉల్లిగడ్డ - 1
కొత్తిమీర - గుప్పెడు
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా


తయారుచేసే విధానం :
1. మటన్ కీమాని శుభ్రంగా కడిగి, అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.
2. శనగపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలి.
3. బాగా నానిన శనగపప్పు, సోంపు, లవంగాలు, దాల్చినచెక్క రుబ్బుకోవాలి.
4. చివరగా మటన్ కీమాని వేసి కొద్దిగా రుబ్బుకోవాలి. 
5. ఈ మిశ్రమంలో తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
6. వీటిని చిన్న చిన్న వడల్లా వత్తుకుని నూనెలో వేసి వేయించాలి. తక్కువ మంట మీద వడలు చక్కగా వేగేలాగా వేయించాలి.
సాయంకాలం పూట స్నాక్స్ లా చేసుకుని ఇంటిల్లిపాది ఆనందించండి.

Comments