Instant Sooji Vada | Semolina vada | Easy recipes

     వడలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేవి మినపవడలు, మసాలా వడలు. ఇవి చేయాలంటే preparation time తగినంత ఉండాలి. 
     మన ఇంటికి ఎప్పుడూ రాని బంధువులు హఠాత్తుగా వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూనే అప్పటికప్పుడు చాలా త్వరగా ఈ instant వడలు వేసేయవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు తక్కువ మరియు అవన్నీ సాధారణంగా అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉండేవే.

కావలసిన పదార్థాలు : 
     ఉప్మా రవ్వ - 1 చిన్న టీ గ్లాస్
     ఉల్లిగడ్డ - మీడియంది సగం
     పచ్చి మిరపకాయ - ఒక అంగుళం
     కొత్తిమీర
     కరివేపాకు
     పెరుగు - తగినంత
     బేకింగ్ సోడా - 1/8 స్పూన్
     ఉప్పు - 1/8 స్పూన్ లేదా తగినంత
     నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
 
తయారుచేసే విధానం :
1. ఉప్మా రవ్వ, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చి మిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
2. పెరుగుని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి కొంచెం ముద్దగా అయ్యాలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా రాకుండా చూసుకోవాలి.
3. దీనిని ఒక 15 నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి. అప్పుడు పిండి బాగా నాని కొంచెం గట్టిపడుతుంది. ఈ లోపులో మీరు పల్లి చట్నీ చేసేయొచ్చు.
4. ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి అది కాగేలోపు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పెరుగు వేసి వడ వేయగలిగే consistency ఉండేలా చూసుకోవాలి.

5. ఏదైనా ఆకు గానీ పల్చటి కవర్ గానీ తీసుకుని చేతికి నీళ్లు అద్దుకుంటూ పిండితో చిన్న చిన్న వడలు వత్తుకోవాలి. 
6. మీడియం మంట మీద దోరగా వేయించుకోవాలి.
  మీరు కూడా చేసి చూడండి. ఉదయం టిఫిన్ లో తినవచ్చు లేదా పెరుగు వడ చేసుకోవచ్చు.

Comments