మునగాకు పొడి | Moringa powder


కావలసిన పదార్థాలు :
మునగాకు - 4 కప్పులు
నల్లనువ్వులు - 1 కప్
అవిశ గింజల పొడి - 1/2 కప్
ఎండు మిరపకాయలు - 3
వెల్లుల్లి రెబ్బలు - 7
ఉప్పు - తగినంత


1. మునగాకుని రెండు సార్లు ఉప్పునీటిలో బాగా కడిగి, ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. నేను ఉదయం ఆరబెట్టి, సాయంత్రం పొడి తయారు చేసాను. 



2. ఆరిన మునగాకుని ఒక బాణలిలో వేసి తక్కువ మంట మీద ఆకులు గలగలమనే వరకు వేయించాలి.అలాగే నువ్వులు కూడా వేయించాలి. నా దగ్గర అవిశ గింజల పొడి ఉండడం వల్ల వేసాను. లేదంటే వాటిని కూడా వేయించి పెట్టుకోవాలి.

3. చివరగా 2 చుక్కలు నూనె వేసి, ఎండు మిరపకాయలు మరియు వెల్లుల్లి వేయించాలి.

4. అన్నిటిని బాగా చల్లారనివ్వాలి. తగినంత ఉప్పు జతచేసి పొడి చేసుకోవాలి.

5. మునగాకు పొడి ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మనకి రోజుకి కావలసిన పోషకాలు అందుతాయి.

Comments