RAWA JAMUN | Sweet
కావాల్సిన పదార్థాలు :
ఉప్మా రవ్వ 1 కప్
పాలు 1 1/2 కప్
నెయ్యి 1 స్పూన్
బేకింగ్ సోడా 1/2 స్పూన్
చక్కెర - 1 కప్
నీళ్లు - 1 కప్
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
తయారుచేసే విధానం :
1. చక్కెర, నీళ్లు, యాలకులు వేసి 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికిస్తే జీరా తయారవుతుంది.
2. పాలు మరిగి ఒక పొంగు వచ్చాక అందులో బేకింగ్ సోడా, సగం స్పూన్ చక్కెర, నెయ్యి వేసి కలపాలి.
3. కొద్ది కొద్దిగా ఉప్మా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. పిండి గట్టిపడ్డాక స్టవ్ ఆపేసి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి.
5. పిండిని మీకు కావలసిన విధంగా ఉండలు చేసుకోవాలి.
6.ఉండలను నూనెలో వేసి ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత తిప్పి అన్ని వైపులా వేగేలాగా వేయించుకోవాలి. వెంటనే కదిపితే పిండి బాణాళికి అతుక్కుంటుంది.
7. ఇలా తయారైన జామూన్ లను జీరాలో వేయాలి.
8. అన్ని జామూన్ లు జీరాలో వేసాక 30 సెకన్లు మీడియం మంటపై ఉడికించాలి.
9. ఒక గంట తర్వాత నోరూరించే రవ్వ జామూన్ రెడీ.
Comments
Post a Comment