Steamed Fish
మాంసహారుల్లో చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు చాలా అరుదు. అలాగే చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసు అయినా వేపుడు అయినా నూనె బాగా దట్టించాల్సిందే. నూనె లేకుండా చేయడం ఎలా అని ఆలోచిస్తుంటే ఈ ఆలోచన తట్టింది. ఇందులో ఒక్క చుక్క కూడా నూనె వాడము.
కావలసిన పదార్థాలు :
చేప ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
నిమ్మరసం
కారం
ఉప్పు
తయారుచేసే విధానం :
1. చేపముక్కలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, కారం కలిపి గంట సేపు నానబెట్టుకోవాలి.
2. ఒక పాత బాణలి తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి చేపముక్కలని పెట్టాలి.
3.మూత పెట్టి 15 నిమిషాలు మీడియం మంటపై ఆవిరి మీద ఉడికించుకోవాలి.
Comments
Post a Comment