టమాటో రైస్ | Tomato Rice
ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు, చాలా సులభంగా చేసుకోగలిగిన మంచి లంచ్ రెసిపీ "టమాటో రైస్".
కావాల్సిన పదార్థాలు :
ఉల్లిగడ్డ - 1 మీడియం
టొమాటోలు - 2
మసాలా దినుసులు
అల్లం వెల్లులి పేస్ట్ - 1/2 స్పూన్
పచ్చి మిరపకాయ - 1
బాసుమతి రైస్ - 250 గ్రాములు
కొత్తిమీర
పుదీనా
నూనె - 2 స్పూన్స్
నెయ్యి - 1 స్పూన్
పసుపు - కొద్దిగా
కారం 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం :
1. ఒక గిన్నె పెట్టి, నూనె మరియు నెయ్యి వేయాలి. కాగిన తర్వాత అందులో మసాలా దినుసులని వేసి వేగనివ్వాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయ వేసి వేయించుకోవాలి.
2. ఉల్లిపాయలు వేగేలోపు టొమాటోలను పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మరియు టొమాటో పేస్ట్, పుదీనా వేసి నూనె పైకి తేలేవరకు వేయించుకోవాలి. ఇందులో పసుపు, కారం వేయాలి.
3. ఒక గ్లాస్ రైస్ కి 1 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మరగడం మొదలయ్యాక అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. ఇలా వేయగానే నీళ్లు పొంగడం ఆగిపోతుంది. అందుకని ఎక్కువ మంట మీద బియ్యం పొంగు వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే రైస్ కి మంచి సువాసన వస్తుంది.
4. తర్వాత తక్కువ మంటపై ఏడు నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసి 15 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఇక్కడ మట్టి గిన్నె తీసుకున్నా కాబట్టి ఆ వేడికి అన్నం బాగా ఉడకడమే కాకుండా పొడి పొడిగా కూడా వస్తుంది.
చాలా త్వరగా, తక్కువ పదార్థాలతో తయారైన, ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ.
Comments
Post a Comment