దొండకాయ కరివేపాకు పచ్చడి
ఇంట్లో ఉన్న పదార్థాలతో అప్పటికప్పుడు సులభంగా చేసుకోగల రుచికరమైన దొండకాయ కరివేపాకు పచ్చడి ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు :
దొండకాయలు - 10
కరివేపాకు - గుప్పెడు
టొమాటో - 1
వెల్లుల్లి - 5 రెబ్బలు
పచ్చి మిరపకాయలు - 2
జీలకర్ర - 1/2 స్పూన్
పసుపు - కొద్దిగా
నూనె - 3 స్పూన్స్
నీళ్లు - 3 స్పూన్స్
తాలింపు దినుసులు
ఉప్పు - తగినంత 🤗
తయారుచేసే విధానం :
1. ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి జీలకర్ర వేయించి, దొండకాయలు, కరివేపాకు, టొమాటో, మిరపకాయలు, వెల్లుల్లి, పసుపు, ఉప్పు వేసి 3 స్పూన్ల నీళ్లు వేసి మూతపెట్టి తక్కువ మంటపై ఉడికించాలి.
2. చల్లారిన తరువాత పచ్చడిలా రుబ్బుకోవాలి.
3. మిగిలిన రెండు స్పూన్ల నూనె వేసి తాలింపు దినుసులు వేయించుకోవాలి. అందులో పచ్చడి వేసి రెండు నిమిషాలు వేయించి దించుకోవాలి.
Comments
Post a Comment