చికెన్ పచ్చడి | Chicken Pickle

     నాన్ వెజ్ ప్రియులకి చికెన్ పచ్చడి గుర్తొస్తే నోట్లో నీళ్లూరకుండా ఉండదు. కారంగా, మసాలాలు దట్టించిన పచ్చడి అన్నంలోకి, ఇడ్లీ, దోసల్లోకి చాలా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ - 1/2 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కారం - 2 స్పూన్స్
ధనియాల పొడి - 2 స్పూన్స్
ఆవాలు - 1/2 స్పూన్
మెంతులు - 1/4 స్పూన్స్
లవంగాలు - 4
అనాస పువ్వు - 1
సోంపు - 1/4 స్పూన్
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
నూనె - 100 గ్రాములు
నిమ్మకాయ - పెద్దది 1


తయారుచేసే విధానం :

1. చికెన్ చిన్న ముక్కలుగా కోసి ఉప్పు, పసుపు వేసి గంట సేపు నానబెట్టాలి.

2. ఆవాలు, మెంతులు, లవంగాలు, అనాస పువ్వు, సోంపు, దాల్చినచెక్క దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కారం, ధనియాల పొడి మరియు తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. 

3. ఒక స్పూన్ నూనె వేసి చికెన్ నీళ్లు ఇంకిపోయేవరకు వేయించుకోవాలి.

4. ఒక బాణలిలో 100 గ్రాముల నూనె వేసి చికెన్ ముక్కల్ని వేసి బాగా వేయించాలి.

5. చికెన్ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
6. పొడిని చల్లుకుని రెండు నిమిషాలు వేయించాలి.
7. ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం, వెల్లుల్లి వేసి బాగా కలిపి ఒక గాలి చొరబడని గాజుసీసాలో భద్రపరచుకోవాలి.
8. రెండు రోజులు బాగా ఊరిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి రెండు వారాలు నిల్వ ఉంటుంది. కానీ అంతకు ముందే పచ్చడి ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువ. 😄🤗

Comments