బేబీ కార్న్ బీన్స్ ఫ్రై | Baby Corn Beans Fry
బేబీ కార్న్ చూడడానికి చిన్నగా, అందంగా ఉండడమే కాదు ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి. వీటిలో గంజి శాతం తక్కువ, కెలోరీలు తక్కువ, పీచుపదార్థాలు ఎక్కువ, కార్బ్స్ తక్కువ. జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. బేబీ కార్న్ లో విటమిన్ A, ఐరన్, మెగ్నేసియం మరియు ఫాస్ఫరస్ లభిస్తాయి.
కావలసిన పదార్థాలు :
బేబీ కార్న్ - 5
బీన్స్ - 4
క్యారెట్ - 1
చిన్న ఉల్లిగడ్డలు - 10
పచ్చి మిరపకాయలు - 1
పుదీనా
కొత్తిమీర
నెయ్యి - 1 స్పూన్
ఉప్పు - 2 చిటికెళ్లు
మిరియాల పొడి - 2 చిటికెళ్లు
తయారుచేసే విధానం :
1. ఒక ఇనుప బాణలిలో నెయ్యి వేసి, ఉల్లిగడ్డలు మరియు బీన్స్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
2. సన్నగా తరిగిన బేబీ కార్న్ ముక్కలు, ఉప్పు కూడా వేసి మూడు నిమిషాలు మూత పెట్టి వేయించాలి.
3. ఇప్పుడు తురిమిన క్యారెట్ వేసి 30 సెకన్లు వేయించాలి.
సాయంకాలం పూట స్నాక్స్ లా తినడానికి చాలా బాగుంటుంది.
తినేటప్పుడు మధ్య మధ్యలో బేబీ కార్న్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది.
డైట్ చేసేవాళ్ళు ఒక పూట భోజనం బదులుగా తినవచ్చు. మీరు కూడా ప్రయత్నించండి.
Comments
Post a Comment