బెండకాయ బజ్జీ | రాయలసీమ స్పెషల్ | Ladies finger curry
కావలసిన పదార్థాలు :
బెండకాయలు - 250 గ్రాములు
ఉల్లిగడ్డ - 1
టొమాటోలు - 2
మిరపకాయలు - 5
చింతపండు - కొద్దిగా
నూనె - 1 స్పూన్
నూనె - 1 స్పూన్
నీళ్లు - 100 ml
ఉప్పు - 1/2 స్పూన్ల్
తాలింపు దినుసులు
తయారుచేసే విధానం :
1. బెండకాయ బజ్జీ చేయడానికి కూరగాయలు కాస్త పెద్దవిగానే కోసుకోవచ్చు.
2. ఒక మట్టిపాత్ర తీసుకుని నూనె వేసి కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ వడిమి వేసాను.
3. తర్వాత ఉల్లిముక్కలు, మిరపకాయలు వేసి ఒక నిమిషం వేయించాలి. తర్వాత టోమాటోలు వేసి ఒక నిమిషం వేయించాలి.
4. ఇప్పుడు బెండకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.
5. తర్వాత నీళ్లు పోసి పది నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.
6. ఇప్పుడు పప్పుగుత్తితో మెదుపుకోవాలి. అంతే... ఎంతో త్వరగా బెండకాయ బజ్జీ రెడీ అవుతుంది.
ఈ కూర రాగి సంగటికి చాలా రుచిగా ఉంటుంది. కొంచెం జిగురుగా ఉన్నట్టు అనిపించినా రుచిలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు. మీరు కూడా ప్రయత్నించండి.
Comments
Post a Comment