మామిడి అల్లం పచ్చడి | Mango Ginger Pickle

      మామిడి అల్లం పచ్చడి పుల్లగా, కారంగా పెరుగన్నలో తింటే చాలా బాగుంటుంది. 
మామిడి అల్లం చూడటానికి అల్లం లేదా పచ్చి పసుపు లాగా ఉంటుంది.
మామిడిఅల్లంని గోటితో గిల్లి వాసన చూస్తే అల్లం అనిపిస్తుంది.
మామిడి అల్లం తిని చూస్తే పచ్చి మామిడికాయ లాగా అనిపిస్తుంది.

కావలసిన పదార్థాలు : 
మామిడి అల్లం - 250 గ్రాములు
పచ్చి మిరపకాయలు - 5
నిమ్మకాయ - 1
ఉప్పు - 1 స్పూన్

తాలింపు కోసం : 
నూనె - 1 స్పూన్
ఆవాలు - 1/4 స్పూన్
ఎండు మిరపకాయలు - 1
ఇంగువ - చిటికెడు

తయారుచుసే విధానం :

1. మామిడి అల్లం పొట్టు తీసి కడిగి నీళ్లు ఆరిపోయేలా తుడిచిపెట్టుకోవాలి.
2. పచ్చి మిరపకాయలు సన్నగా తరగాలి.
3. ఒక గిన్నెలో మామిడి అల్లం, పచ్చి మిరపకాయలు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
4. తాలింపు పెట్టి పచ్చడిలో కలుపుకోవాలి.
     మీరు కూడా ప్రయత్నించండి. చాలా రుచిగా ఉంటుంది.

Comments