ఎర్రగడ్డ అన్నం | Onion Garlic Rice

     బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళెవరు ఉంటారు!!! ఇది బిర్యానీ దినుసులు వేసి తక్కువ తక్కువ మసాలాతో చాలా త్వరగా చేయగలిగే మంచి లంచ్ ఐటమ్. బాసుమతి రైస్ లో మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు.

కావలసిన పదార్థాలు : 

బాసుమతి బియ్యం - 350 గ్రాములు ( 1 1/2 గ్లాసులు)
ఎర్రగడ్డ - 1 పెద్దది
వెల్లుల్లి - 20 రెబ్బలు
పచ్చి మిరపకాయలు - 3
జీడిపప్పు - 10
బిర్యానీ మసాలా
నెయ్యి - 2 స్పూన్స్
ఉప్పు - 1/2 స్పూన్
నీళ్లు - 2 1/2 గ్లాసులు

తయారుచేసే విధానం : 

1. బాసుమతి బియ్యం కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి.

2. ఒక మట్టికుండ తీసుకుని స్టవ్ పైన పెట్టి అది వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసి వేయించుకోవాలి.

3. ఎర్రగడ్డ, వెల్లుల్లి, మిరపకాయలు వేసి వేయించుకోవాలి.

4. నీళ్లు పోసి ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి.

5. మీడియం మంట పైన పది నిమిషాలు వండితే ఎర్రగడ్డ అన్నం సిద్ధం.

పల్లీల చట్నీ ఎర్రగడ్డ అన్నంకి చక్కటి కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.

Comments