పాలకూర పకోడీ
కావలసిన పదార్థాలు :
పాలకూర - 1 కప్ సన్నగా తరిగినది
శనగపిండి - 1/2 కప్
కారం - 1/4 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 స్పూన్
గరం మసాలా - 1/4 స్పూన్
ఉప్పు - 1/4 స్పూన్
నూనె - డీప్ ఫ్రై కి సరిపడినంత
తయారుచేసే విధానం :
1. శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు బాగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూర వేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా, గట్టిగా కలపకూడదు.
3. మీడియం మంటపై నూనెలో పకోడీలుగా వేసి వేయించుకోవాలి.
పాలకూర పకోడీ కమ్మగా, కర కరలాడుతూ చాలా బాగుంటుంది. సాయంకాలం స్నాక్స్ లా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఇంకా ఇందులో తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపూత, వాము, పచ్చి మిరపకాయలు, దంచిన వెల్లుల్లి ఇలా రకరకాల పదార్థాలు వేసి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించండి.
Comments
Post a Comment