అనప గింజల మిక్చర్

    అనప గింజల మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. అయితే చేయడానికి చాలా ఓపిక ఉండాలి. మీకు తగినంత సమయం ఉన్న రోజుల్లో చేసుకుంటే మంచిది.

     అనపకాయలు చూడ్డానికి చిక్కుడు కాయల్లాగా ఉంటాయి. కాయలు అనిగిపోయినట్టుగా ఉన్నా లోపల గింజలు బాగుంటాయి. మనకి కావాల్సింది ఈ గింజలే. అనప కాయల పై తొక్క చాలా ముదురుగా ఉండి, కూర చేయడానికి అనువుగా ఉండదు. అందుకని మీ దగ్గర కంపోస్ట్ బిన్ ఉంటే అందులో వేసేయండి. 

     ఇప్పుడు ఒక్కొక్క గింజకి పైన ఉన్న పొరని జాగ్రత్తగా తీయాలి. ఆ పొట్టు కూడా కూరల్లో వాడలేము.
     ఇంత కష్టపడి తీసిన గింజలే మిక్చర్ కి ముఖ్యమైన పదార్థం. గింజలు రెడీగా ఉంటే మిక్చర్ చేయడం త్వరగా అయిపోతుంది.

కావలసిన పదార్థాలు :

పైపొట్టు తీసిన అనప గింజలు
పల్లీలు
అటుకులు
ఎండుమిరపకాయలు
వెల్లుల్లి
కరివేపాకు
ఉప్పు
కారం
పసుపు
డీప్ ఫ్రై కి సరిపడా నూనె

తయారు చేసే విధానం :

1. ఒక బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత అనప గింజలు వేసి దోరగా వేయించుకోవాలి.
గింజలు గల గలమని శబ్దం వచ్చేలా వేగినప్పుడు నూనె నుండి తీసివేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. పల్లీలు, అటుకులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు నూనెలో వేయించుకోవాలి.

3. ఈ మధ్యలో వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చివరగా వెల్లుల్లిని కూడా వేయించుకోవాలి.
4. వేయించినవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి.
5. ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి.
     సాయంకాలం పూట snacks గా తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించండి.

Recipe Credits : Mrs. Annapurna Anil Kumar

Comments