కజ్జికాయలు


కజ్జికాయలు సాయంకాలం పూట స్నాక్స్ లా తినడానికి చాలా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు :
గోధుమపిండి - 1 కప్
మైదాపిండి - 1/2 కప్
ఉప్పు - 1/8 స్పూన్
నెయ్యి - 4 స్పూన్స్
ఎండు కొబ్బరి - 1/2 కాయ
పల్లీలు - 1/2 కప్
పుట్నాలు - 1 కప్
గసగసాలు - 1/2 స్పూన్
సన్నటి ఉప్మా రవ్వ - 2 స్పూన్స్
చక్కెర - 1 1/2 కప్
జీడిపప్పు, బాదం పప్పు - 7
యాలకులు - 2
తయారుచేసే విధానం : 

1. గోధుమపిండి, మైదాపిండి, 2 స్పూన్స్ నేయి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. మూతపెట్టి అరగంట సేపు నానబెట్టాలి.
2. ఒక బాణలిలో పల్లీలను, పుట్నాలను విడివిడిగా దోరగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరిని ముక్కలుగా కోసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా రెండు నిమిషాలు వేయించుకోవాలి. చివర్లో ఉప్మారవ్వ, గసగసాలు వేసి వేయించాలి.
3. అదే బాణలిలో నెయ్యి వేసి చిన్న ముక్కలుగా చేసిన జీడిపప్పు, బాదంపప్పు వేయించుకోవాలి.
4. పల్లీలు, పుట్నాలు పొడి చేసుకోవాలి. 1/2 కప్ చక్కెర మరియు యాలకులు కూడా పొడి చేసుకోవాలి.

5. ఇప్పుడు ఒక గిన్నెలో పల్లీ పొడి, పుట్నాల పొడి, కొబ్బరి, ఉప్మా రవ్వ, గసగసాల పొడి, చక్కెర పొడి, చక్కెర, జీడిపప్పు, బాదంపప్పు వేసి కలుపుకోవాలి.
6. కలిపి పెట్టుకున్న గోధుమపిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని వీలైనంత పల్చగా రుద్దుకోవాలి. దీన్ని కజ్జికాయలు చేసే మౌల్డ్ లో వేసి, 1 1/2 స్పూన్ల పూర్ణం వేసి, అంచుల చుట్టూ నీటితో తడిపి కజ్జికాయలు చేసుకోవాలి. ఎక్కడా పగుళ్లు లేకుండా జాగ్రత్త పడాలి. చిన్న రంధ్రం ఉన్నా అందులోంచి పూర్ణం బయటికి వచ్చి కజ్జికాయలు పాడైపోతాయి.
7. ఇప్పుడు ఈ కజ్జికాయలని మీడియం మంటపై నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటాయి.

Comments