చిక్కుడుకాయ టొమాటో కూర
కావలసిన పదార్థాలు :
చిక్కుడుకాయలు - 250 గ్రాములు
ఉల్లిగడ్డ - 1
టొమాటోలు - 2
వెల్లుల్లి - 3
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - గుప్పెడు
నూనె - 2 స్పూన్స్
ఉప్పు - 1/2 స్పూన్
పసుపు - 1/4 స్పూన్
కారం - 1/2 స్పూన్
ఆవాలు - 1/2 స్పూన్
నీళ్లు - 50ml
తయారుచుసే విధానం :
1. చిక్కుడుకాయల చివర్లలో ఉన్న భాగాన్ని చేత్తో తీస్తే నార వచ్చేస్తుంది.
వీటిని చిన్న ముక్కలుగా తుంచేటప్పుడు కూడా నార ఉంటే తీసివేయాలి.
2. ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత టొమాటోలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, చిక్కుడుకాయలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు వేయించుకోవాలి.
3. తర్వాత 50ml నీళ్లు పోసి, మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి.
4. ఈ కూర చాలా త్వరగా అవడమే కాకుండా అన్నం, చపాతిల్లోకి చాలా బాగుంటుంది.
Comments
Post a Comment