దోసకాయ సాంబార్

కావలసిన పదార్థాలు : 
దోసకాయ - 1
ఉల్లిగడ్డ - 1/2
టొమాటో - 1
పచ్చి మిరపకాయలు - 2
కందిపప్పు - 100 గ్రాములు
చింతపండు - కొద్దిగా
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - గుప్పెడు
ఆవాలు - 1/2 స్పూన్
జీలకర్ర - 1/2 స్పూన్
వెల్లుల్లి - 3 రెబ్బలు
ఎండు మిరపకాయ - 1
తయారుచేసే విధానం :

1. కందిపప్పుని బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే చింతపండుని కూడా కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
2. రాచిప్పలో తరిగిన ఉల్లిగడ్డ, టొమాటో, పచ్చి మిరపకాయలు, దోసకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి.
3. రాచిప్ప వేడెక్కడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ లోపల కందిపప్పుని ఉడికించి, పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి.

4. రాచిప్పలో ఒకసారి పొంగు వచ్చిన తర్వాత కందిపప్పుని వేసుకోవాలి.
5. బాగా కలిపి అందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. మరోసారి పొంగు వచ్చిన తర్వాత అందులో విడిగా వేసుకున్న తాలింపుని సాంబార్ లో వేసి స్టవ్ ఆపేయాలి. రాచిప్పలో చాలాసేపు వేడి అలాగే ఉంటుంది. అందుకని సాంబార్ లోని ముక్కలు బాగా ఉడికిపోతాయి.
     
     రాచిప్పలో ఉడకడం వల్ల దోసకాయ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి.

Comments