గరం మసాలా పొడి | Garam masala powder


కావలసిన పదార్థాలు :

బిర్యానీ ఆకులు - 5
ధనియాలు - 1 స్పూన్
సోంపు - 2 స్పూన్స్
షాజీరా - 2 స్పూన్స్
జీలకర్ర - 1 స్పూన్
లవంగాలు - 10
జాపత్రి - 2
యాలకులు - 4
అనాస పువ్వులు - 2
మరాఠీ మొగ్గలు - 2
జాజికాయ - 1/2 (సగం కాయ)
దాల్చినచెక్క - 3 అంగుళాలు ముక్కలు
మిరియాలు - 1/2 స్పూన్
కసూరీ మేథీ - 1 స్పూన్

తయారుచేసే విధానం : 

1. పైన తీసుకున్న దినుసులన్నీ తక్కువ మంటపై మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి. 
2. బాగా చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా చేసుకోవాలి.

3. ఈ పొడిని ఒక గాజుసీసాలో పెట్టుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటుంది. అవసరాన్ని బట్టి కొద్దిగా పొడి వేసుకున్నా కూరలు గానీ, బిర్యానీ గానీ మంచి సువాసనతో ఉంటుంది.

      మీరు కూడా ఒకసారి ఈ గరం మసాలా పొడిని తయారుచేసి వంటల్లో వాడి చూడండి. రుచిలో తేడా తప్పకుండా గమనిస్తారు.

Comments