పెసరట్టు | Green Moong Dal Dosa
పెసరట్టు అంటే తెలియని వాళ్ళు చాలా అరుదు. పెసలులో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది.
కావలసిన పదార్థాలు :
పెసలు - 100 గ్రాములు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిరపకాయ - 1
జీలకర్ర - 1/4 స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - 1/8 స్పూన్
నూనె లేదా నెయ్యి - పెసరట్టుకి సరిపడినంత
తయారుచేసే విధానం :
1. పెసలుని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. నానిన పెసలు, అల్లం, మిరపకాయ, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి మెత్తని పిండిగా రుబ్బుకోవాలి.
నేను పిండిని రోటిలో మెల్లగా 45 నిమిషాల పాటు రుబ్బాను. పిండి చాలా మెత్తగా వచ్చింది.
3. ఈ పిండిని అరగంట సేపు అలాగే ఉంచాలి.
4. ఇప్పుడు పెనంపైన దోసలా వేసుకుని ఉల్లిముక్కలు చల్లుకుని తినడమే.
రుచికరమైన పెసరట్టు ఉదయం అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
మీరు కూడా ప్రయత్నించండి.
Comments
Post a Comment