పల్లీ చిక్కీ | Peanuts Chikki

      పల్లీ చిక్కీ తెలియని వాళ్ళు ఎవరుంటారు. పల్లీలు, బెల్లం కాంబినేషన్ అంటేనే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 

కావలసిన పదార్థాలు : 
పల్లీలు - 1 గిన్నె
బెల్లం - 3/4 గిన్నె
నెయ్యి - 1/4 స్పూన్
నీళ్లు - 1 స్పూన్

తయారుచేసే విధానం :

1. పల్లీలను తక్కువ మంట మీద దోరగా వేయించుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసివేయాలి.
ఒక ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. అలాగే అడుగు చదునుగా ఉన్న ఒక చిన్న గిన్నె బయటి అడుగుభాగంలో నెయ్యి రాసి పెట్టుకోవాలి. దీన్ని పల్లీ బెల్లం పాకం ప్లేట్ లో సమానంగా పరుచుకోవడానికి. వాడుతాము.
2. ఒక గిన్నెలో బెల్లం వేసి, ఒక స్పూన్ నీళ్లు వేసి ముదురు పాకం పట్టాలి.

3. ఒక ప్లేటులో నీళ్లు పోసి, అందులో ఒక చుక్క బెల్లంపాకం వేయాలి. కొన్ని సెకన్ల తర్వాత పాకం గట్టిపడి, కొడితే శబ్దం వస్తుంది.

4. 
ఇప్పుడు పల్లీలను పాకంలో వేసి వెంటనే కలుపుకోవాలి. వెంటనే నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకోవాలి. చిన్న గిన్నెతో అదుముతూ ప్లేట్ మొత్తం సమానంగా పరుచుకోవాలి.
5. రెండు నిమిషాల తర్వాత, వేడిగా ఉన్నప్పుడే పొడవు, అడ్డగీతలుగా కత్తితో గీసుకోవాలి.
6. బాగా చల్లారిన తర్వాత, కత్తితో తీస్తే చిక్కీ ముక్కలు సులభంగా వస్తాయి.

వీటిని ఒక డబ్బాలో భద్రపరచుకోండి.
     ఫోటోలో పల్లీ చిక్కీ ముక్కలు చతురస్రాకారంలో చక్కగా ఉన్నాయి. అన్నీ ఇలాగే వస్తాయి అనుకోకండి. ప్లేట్ యొక్క చివర్లలో ఉన్న ముక్కలు చూడడానికి చతురస్రాకారంలో లేవని పడేయకండి. చక్కగా అన్నీ తినండి.

Comments