గుమ్మడికాయ హల్వా || Pumpkin Halwa

కావలసిన పదార్థాలు :
బూడిద గుమ్మడికాయ తురుము - 3 స్పూన్స్
తేనె - 1 స్పూన్
జీడిపప్పు - 5
నెయ్యి - 1 స్పూన్
యాలకుల పొడి - చిటికెడు
ఉప్పు - 1/4 చిటికెడు

తయారుచేసే విధానం :

1. బూడిద గుమ్మడికాయ నుండి గింజలు వేరుచేసి పెట్టుకోవాలి. చెక్కు తీసి తురుముకోవాలి.

2. గుమ్మడికాయ తురుములో ఉన్న నీటిని చేతితో పిండి వేరుచేయాలి.
3. ఒక బాణలిలో నెయ్యి వేసి, వేడయ్యాక, అందులో జీడిపప్పుని వేయించుకోవాలి.

4. వేగిన జీడిపప్పు తీసివేసి, మిగిలిన నెయ్యిలో గుమ్మడికాయ తురుము వేసి తక్కువ మంటపై 5 నిమిషాలు వేయించుకోవాలి.
యాలకుల పొడి, ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుతూ మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి.
5. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత అందులో తేనె, జీసిపప్పు వేసి కలుపుకోవాలి.

తక్కువ సమయంలో చక్కెర వాడకుండా చేసిన గుమ్మడికాయ హల్వా చాలా రుచిగా ఉంటుంది.

Comments