గోంగూర పప్పు | Sorrel Leaves Dal


కావలసిన పదార్థాలు : 
గోంగూర - 1 కట్ట లేదా 4 గుప్పెళ్ళు
కందిపప్పు - 1 కప్పు
టొమాటోలు - 2
పచ్చి మిరపకాయలు - 5
పసుపు - 1/4 స్పూన్
ఉప్పు - 1 స్పూన్

తాలింపు కోసం :
ఆవాలు
జీలకర్ర
ఉల్లిగడ్డ
వెల్లుల్లి
కరివేపాకు
నూనె
తయారు చేసే విధానం : 
1. కందిపప్పుని బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి.

2. గోంగూరని శుభ్రపరచి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

3. ఒక కుక్కర్ లో నానిన కందిపప్పు, పసుపు, గోంగూర, టొమాటో, పచ్చి మిర్చి ముక్కలు వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 4 విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడుకుటుంది.
4. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి ఒక పప్పుగుత్తితో అంతా కలిసేలాగా మెత్తగా చేసుకోవాలి.
5. తాలింపు కోసం వడియం వాడితే గోంగూర పప్పు ఘుమ ఘుమలాడుతుంది.
ఇది ఒక్కటి ఉంటే చాలు మిగిలిన తాలింపు దినుసులతో పని లేదు. వడియంని పొడి చేసుకుని ఒక గాజుసీసాలో వేసుకుంటే తాలింపు కోసం రెడీగా ఉంటుంది.

6. చివరిగా 
తాలింపు వేసి, ఐదు నిమిషాలు ఉడికిస్తే నోరూరించే పుల్ల పుల్లని గోంగూర పప్పు సిద్ధం.
     గోంగూర పప్పు అన్నంలోకి, చపాతిలోకి చాలా బాగుంటుంది.
     ఒకసారి రాగి సంకటితో తిని చూడండి.
Related posts : 

Comments