కొబ్బరి టొమాటో పచ్చడి | Coconut Tomato Chutney | Easy Recipies
కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నోరకాల ప్రొటీన్లు, ఎంజైములు ఉన్నాయి. ఇందులో ఉండే పీచుపదార్థము మలబద్ధకము, థైరాయిడ్ వంటి సమస్యలకి చక్కగా పనిచేస్తుంది. ఇవే కాకుండా, విటమిన్లు C, E, B1, BE, B5, BY మరియు ఐరన్, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో సులభంగా చేయగలిగిన కొబ్బరి టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు :
పచ్చి కొబ్బరి - 1/4 కాయ
టొమాటో - పెద్దది 1
జీలకర్ర - 1/2 స్పూన్
పచ్చి మిరపకాయలు - 2
చింతపండు - కొద్దిగా
వెల్లుల్లి - 7 రెబ్బలు
నూనె - 2 స్పూన్స్
నీళ్లు - 40ml
ఉప్పు - తగినంత
తాలింపు కోసం :
ఆవాలు
మినప్పప్పు
ఎండు మిరపకాయ
కరివేపాకు
తయారుచేసే విధానం :
1. ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి కొబ్బరి, టొమాటో, జీలకర్ర, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి ఒక నిమిషం పాటు వేయించి, తర్వాత తగినంత ఉప్పు వేసి మూతపెట్టి 5 నిముషాలు మగ్గనివ్వాలి.
2. చల్లారిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి.
3. చివరగా తాలింపు వేసి పచ్చడిలో కలుపుకోవాలి. నేను కరివేపాకు బదులుగా కరివేపాకు పొడిని వాడాను.
ఇలాంటి పచ్చళ్ళను ఏ రోజుకారోజు ఒక పూట భోజనంలో చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా చేసినప్పటి రుచి ఉండదు. అందుకని తక్కువ మొత్తంలో చేసుకుంటే మంచిది. రుచి మాత్రం అమోఘం. మీరు కూడా ప్రయత్నించండి.
Comments
Post a Comment