మునగాకు రొయ్యల వేపుడు | Moringa Prawns Fry

     సముద్ర తీర ప్రాంతాల్లో వుండే వారికి రొయ్యలంటే ప్రాణం. అప్పుడప్పుడు రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిది. 

1. రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

2. రొయ్యల్లో కాల్షియమ్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఇ మరియు బి12 ఉండడం వల్ల శరీరంలోని రక్తనాళాలు శుభ్రపడతాయి.

3. రొయ్యల్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. దీంతో కండరాలు బలపడతాయి. ఇలా చాలా ఉపయోగాలు రొయ్యల వల్ల ఉన్నాయి.  రెండు మూడు నెలలకు ఒకసారి రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి.

మునగాకు : 

1. మునగాకులో కాల్షియమ్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ A, B1, B2, BE, C లభిస్తాయి.

2. వీటిలో cells damage ని అడ్డుకుని, immunity ని పెంచే గుణాలున్న anti-oxidents పుష్కలంగా ఉన్నాయి.

3. High B.P, ఉదర సంబంధిత సమస్యలు, అనీమియా, లివర్ సమస్యలని తగ్గిస్తుంది.

4. దెబ్బలు తగినప్పుడు అవి త్వరగా మానడనికి సహాయపడుతుంది.

5. బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులని నివారించడంలో, ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్థాలు : 
     మునగాకు - గుప్పెడు
     రొయ్యలు - పది
     ఉల్లిగడ్డ - చిన్నది
     వెల్లుల్లి - 3
     దాల్చినచెక్క - అంగుళం ముక్క
     కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు - తగినంత
     కొత్తిమీర - కొద్దిగా
     నీళ్లు - 25 ml
     నూనె - 2 స్పూన్స్

తయారుచేసే విధానం : 

1. ముందుగా రొయ్యలను బాగా శుభ్రపరచి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి అరగంట సేపు నానబెట్టాలి.

2. ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి ఉల్లిముక్కలు వేయించాలి.

3. తర్వాత మునగాకు వేసి ఒక నిమిషం వేయించాలి.

4. రొయ్యలు వేసి 2 నిమిషాలు వేయించాలి.

5. నీళ్ళు పోసి, ఉప్పు సరిచూసుకుని పది నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.

6. చివరగా దంచిన వెల్లుల్లి, కొత్తిమీర వేసుకోవాలి. ఈ వేపుడు చేసిన రోజు రాత్రి భోజనం బదులుగా దీన్నే తీసుకున్నాను.

Comments