రాచిప్పలో చిర్రాకు పప్పు | Soapstone cookware
మనకి విరివిగా దొరికే ఆకుకూరల్లో చిర్రాకు ఒకటి. ఈ ఆకుని పప్పుతో కలిపి వండితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
కావాల్సిన పదార్థాలు :
చిర్రాకు - 1 కట్ట
కందిపప్పు - 50 గ్రాములు
టొమాటోలు - 2
పచ్చి మిరపకాయలు - 3
చింతపండు - కొద్దిగా
ఉప్పు - 1 1/2 స్పూన్
కరివేపాకు
తాళింపు కోసం :
ఆవాలు
మినప్పప్పు
నూనె
కరివేపాకు
ఎండు మిరపకాయ
వెల్లుల్లి
1. నేను రాచిప్పలో వండుతున్నాను కాబట్టి చాలా సమయం పడుతుంది. కుక్కర్ లో పెడితే 3 విజిల్స్ కి పని అయిపోతుంది.
2. ముందుగా రాచిప్పలో అరగంట సేపు నానబెట్టిన కందిపప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి మీడియం మంటపై పెట్టాలి. పప్పు ఉడికే లోపల మనం మిగిలిన పనులు చేసుకోవచ్చు.
3. పప్పు ఉడకడానికి కనీసం 30 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఆకుకూర, టొమాటోలు, మిరపకాయలు, చింతపండు వేసి పది నిమిషాలు ఉడికించాలి.
4. చివరగా విడిగా పెట్టుకున్న తాలింపు వేసి దించుకోవాలి.
5. రాచిప్పలో వండిన చిర్రాకు పప్పు చాలా సేపు వేడిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. మీకు కూడా ప్రయత్నించండి.
Related posts :
Comments
Post a Comment