Day 6 to 10 - రాచిప్ప | Kalchatti | Seasoning | Soapstone cookware
రాచిప్ప ( Kalchatti ) Seasoning Day 6 to 10
ఐదు రోజులు నూనె, పసుపు రాసిన తర్వాత రాచిప్ప నల్లగా మారిపోయింది
ఇప్పుడు టిష్యు పేపర్ తో ఒకసారి శుభ్రం చేసుకోవాలి. వేడి వేడి నీళ్లు పోసి చల్లారే వరకు ఉంచాలి. ఈ విధంగా మెల్లమెల్లగా రాచిప్పకి వేడిని అలవాటు చేస్తున్నాం అన్నమాట.
తర్వాత శనగపిండితో రెండుసార్లు రాచిప్పని తోమి కడగాలి.
ఇప్పుడు వేడి గంజిని రాచిప్పలో పోయాలి. రాచిప్ప మునిగితే సరే.
లేకపోతే బియ్యం కడిగిన నీటిని వేడి చేసి రాచిప్ప మునిగే వరకు పోయాలి.
ఇలా పదవ రోజు అయ్యేవరకు ప్రతిరోజు గంజినీళ్ళని మారుస్తూ ఉండాలి. ఈ మధ్యలో రాచిప్పని నీళ్లతో కడగాల్సిన అవసరం లేదు.
నేను ఇదే నీళ్లలో పెరుగు కోసం తీసుకున్న రాతి గిన్నెను కూడా పెట్టాను. పెరుగు కోసం అయితే మొదటి ఐదు రోజులు చేసిన seasoning చేయనవసరం లేదు. అందుకని రాచిప్పతో పాటు కలిపి పెట్టాను.
Comments
Post a Comment