రాచిప్పలో పెసరపప్పు | Soapstone Cookware
కావలసిన పదార్థాలు :
సాంబార్ ఉల్లిపాయలు - 20
టొమాటోలు - 2
పచ్చి మిరపకాయలు - 5
పెసరపప్పు - 100 గ్రాములు
పసుపు - 1/2 స్పూన్
ఉప్పు - 1 స్పూన్
తయారుచేసే విధానం :
1. పెసరపప్పుని ఒక బాణలిలో నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. పెసరపప్పుని బాగా కడిగి నానబెట్టుకోవాలి.
2. రాచిప్పలో ఉల్లిపాయలు, తరిగిన టొమాటోలు, పచ్చి మిరపకాయలు వేసుకోవాలి.
3. నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోవాలి.
4. ఇప్పుడు రాచిప్పని స్టవ్ పైన పెట్టి తక్కువమంట పెట్టుకోవాలి.
5. మధ్యలో ఒకసారి పప్పుని కలిపి ఉప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఉడకడానికి సరిగ్గా 30 నిమిషాలు పట్టింది. గరిటతో తిప్పితే ఉడికిన పెసరపప్పు నలిగి చిక్కగా మారుతుంది.
6. ఇప్పుడు మరొక బాణలిలో తాలింపు వేసుకోవాలి.
7. తాలింపుని పెసరపప్పులో కలుపుకోవాలి.
ఇదే పెసరపప్పు ని కుక్కర్ లో వండితే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదా. ఇంత సేపు ఉడికించడం ఎందుకు? టైమ్ వేస్ట్, గ్యాస్ వేస్ట్, రాచిప్ప కొనడానికి డబ్బులు వేస్ట్ అనుకుంటున్నారు కదా.
మీలాగే నేను కూడా అనుకున్నాను. రాచిప్పలో వండడం మొదలు పెట్టాక మొదట్లో రుచిలో తేడా అనిపించలేదు కానీ రోజులు గడిచే కొద్దీ చాలా రుచిగా అనిపించాయి. సమయం ఉన్నప్పుడు, ప్రతి ఆదివారం రాచిప్పలో వండడం అలవాటుగా మారిపోయింది.
వీలైతే మీరు కూడా ప్రయత్నించండి. చాలా రుచిగా ఉంటుంది.
Related posts :
Comments
Post a Comment